Monday, July 8, 2024

అభివృద్ధి విలయ తాండవం..

ఉత్తరాఖండ్ ప్రకృతి బీభత్సం జాతిని కుదిపేస్తున్నది. వందలాది యాత్రికులను, వేలాది స్థానికులను బలిగొన్న ఈ జలవిలయం ఉత్తరకాశీ, చమోలీ, రుద్రవూపయాగ జిల్లాలను సర్వనాశనం చేసింది. ఉగ్రరూపం దాల్చిన నదుల తాకిడికి రహదారులు, వంతెనలు ఆనవాలు లేకుండా కొట్టుకుపోయాయి. బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లు పేకమేడల్లా కూలిపోయా యి. రోజులు గడుస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతున్నది. కేదార్‌నాథ్ పరిసరాల్లో కుప్పలుగా మృతదేహాలు పడివున్నాయనీ, కుళ్లిపోతున్నాయనీ వార్తలు వస్తున్నాయి. నదుల ఒడ్డున, శిథిలాల్లో, రోడ్ల వెంట ఇప్పటికీ శవాలు తటస్థపడుతున్నాయని మీడియా ప్రతినిధులు రిపోర్టు చేస్తున్నారు. చార్‌ధామ్‌గా ప్రసిద్ధిగాంచిన కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ పుణ్యక్షేవూతాలను దర్శించుకుందామని వెళ్లిన అనేక మంది భక్తుల్లో కొందరు ఇప్పటికీ తమ స్వస్థలాలను చేరుకోలేదు. వారికోసం బంధుమివూతులు ఎదురుచూస్తున్నారు. భారతసైన్యం పగలూ రాత్రనకుండా శిథిలాల్లో చిక్కుకుపోయిన అభాగ్యులను రక్షించడానికి కృషి చేస్తున్నాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పునరావాస చర్యలపై కేంద్రీకరించాయి.

ప్రకృతి ప్రళయాలు భారత్‌కు కొత్తకాదు. కోస్తా తీరంలో, గుజరాత్ కచ్‌లో తుపానులు రావడం మనకు మామూలే. భారీ భూకంపాలు వచ్చి వేలాది మందిని బలిగొనడమూ తెలుసు. టెక్నాలజీ ఆవిష్కరణలతో, ముందు జాగ్రత్తలతో సాధ్యమైనంత తక్కువ నష్టంతో వీటినుంచి బయటపడుతున్నాం.అయితే,ఉత్తరాఖండ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ వరదలు, భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువని తెలిసినా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. నష్ట నివారణ చర్యలు చేపట్టలేదు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనవైఖరి అవలంబిస్తున్నాయని, అభివృద్ధి పేరిట హిమాలయాల ఉనికికి భంగం కలిగించే, నదీవూపవాహాలను కట్టడిచేసే, పర్యావరణానికి చేటుచేసే విధానాలు చేపట్టా యని విమర్శలు వెల్లు వేలాదిమంది బలయ్యారని చెబుతున్నా రు. ఈ వాదనలో వాస్తవము న్నది. పర్యావర ణ నిపుణులు చెబుతున్న ప్రకారం హిమాలయాలు ప్రపంచంలోనే అతితక్కువ వయస్సున్న పర్వతక్షిశేణులు. సహజంగానే వీటి అంతర్భాగంలో కదలికలు, మార్పులు ఇం కా కొనసాగుతున్నాయి.

ఫలితంగానే భూకంపాలు రావ డం, కొండచెరియలు విరిగిపడడం జరుగుతుంటాయి. హి మాలయ ప్రాంతాలైన ఉత్తరాఖండ్, హిమాచల్‌వూపదేశ్, జమ్మూ-కశ్మీర్, సిక్కిం తదితర రాష్ట్రాల్లో ప్రకృతిబీభత్సా లు ఎక్కువగా రావడానికి కారణమిదే. దాదాపు ప్రతీ సం వత్సరం వరదలు వస్తుంటాయి. కొండచెరియలు విరిగిపడుతుంటాయి. మట్టి కూలుతుంటుంది. భూమి కంపిస్తూవుంటుంది. అనేకమంది చనిపోతుంటారు. ఒక్క భూకంపాల మూలంగానే 1991లో 2 వేల మంది, 99 లో 103 మంది, 2005లో 80వేల మంది(పాకిస్తాన్‌తో కలిపి)చనిపోవడం గమనార్హం. వరదల మూలంగా జరిగే ప్రాణనష్టం, ఆస్తినష్టం కూడా చాలా ఎక్కువే. ఈ ప్రత్యేక పరిస్థితుల రీత్యా హిమాలయాల్లో నివసించే ప్రజల జీవనవిధానం ప్రత్యేకరీతిలో ఉంటుంది. శతాబ్దాలుగా మార్కెట్ వ్యవస్థతో వీరికి సంబంధం ఉండేది కాదు. అన్నీ కొం డలు, లోయలే కావడంతో రోడ్డు రవాణా సౌకర్యం ఉండే ది కాదు. ప్రజలు కాలినడకనో, గుర్రాలు, గాడిదలపైనో తమ ప్రయాణాలు కొనసాగించేవారు. చిన్న చిన్న ఇళ్లు.. పరిమితంగా పంటపొలాలు..వర్షాధారమైన వ్యవసా యం, గొర్రెల పెంపకం తదితర సంప్రదాయ వృత్తుల్లో ప్రజలు జీవించేవారు. మంచుకొండలపై వెలసిన పవివూతక్షేవూతాలను సందర్శించడానికి యేటా వచ్చే యాత్రికులకు సాయ పడుతూ తృణమో పణమో పొందుతూ జీవనం కొనసాగిస్తుంటారు.

1990ల వరకూ ఉత్తరాఖండ్ ఇలాగే ఉండేది. అటు తర్వాత ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలొచ్చాయి. 2000 సంవత్సరంలో రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉత్తరాఖండ్‌లో ‘అభివృది’్ధ వేగవంతమైంది. అధికారం చేబట్టిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇక్కడ మెండుగా ఉన్న జల, ఖనిజ, అటవీసంపదపైన కన్ను వేశా యి. ప్రజలకు మౌలిక సౌకర్యాల కల్పన కోసమంటూ పలు ప్రాజెక్టులను చేపట్టాయి. ముఖ్యంగా ఇక్కడ సంవత్సరమంతా పారే జీవనదులు పుష్కలంగా ఉండడంతో జలవిద్యుత్తు పై కేంద్రీకరించాయి. అలకానంద, మందాకిని, నందాకిని, భగీరథి, ధౌలిగంగ, భిలన్‌గంగ నదులపై సుమారు 70 జలవిద్యుత్ కేంద్రాలు నిర్మించి 10వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పథకాలు రచించాయి. వీటిలో కొన్ని ఇప్పటికే పూర్తికాగా, మరికొన్ని ఇంకా నిర్మాణదశలో ఉన్నాయి. ఒక విద్యుత్ కేంద్రం పరిధి ముగుస్తుందో లేదో మరో కేంద్రం మొదలయ్యే పరిస్థితి ఈ నదులపై ఉన్నది. తక్కువ పెట్టుబడులు, ఎక్కువ లాభాల ప్రాతిపదికన ఈ విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టిన గుత్తేదార్లు నిబంధనలు గాలికి వదిలేశారు. టన్నెళ్లు, రిజర్వాయర్ల నిర్మాణం కోసం పేలుళ్లు, తవ్వకాలు జరిపారు. కొండలను తొలిచారు. బండలను పగలేశారు. మట్టిని ఎత్తిపోశారు. నదుల దిశలను మార్చి రిజర్వాయర్లకు మళ్లించారు. కిందికి దూకిన జలాలను మళ్లీ వెంటాడి కాస్త దూరంలో మరోచోట మళ్లీ ఆపారు. భగీరథి పయనంలో 80 శాతం, అలకానంద ప్రవాహంలో 65 శాతం, మిగతా నదులన్నీ 90శాతం ఇలా ప్రభావితమయ్యాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా కొండల అంతర్భాగంలో అలజడి, కదలిక ఎక్కువై భూకంపాలు, కొండచెరియలు విరిగిపడడం తరచూ జరుగుతున్నది. మొన్నటి విలయంలో కూడా అధిక వర్షపాతంతో వరదలు వచ్చి నదులు పొంగిపొర్లగానే భారీయెత్తున కొండచెరియలు విరిగిపడడం ప్రారంభమైంది. ఈ కారణంగానే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు.

అభివృద్ధి రూపంలో ఉత్తరాఖండ్‌కు ఎదురైన మరో విపత్తు పర్యాటకరంగం. 1990 కంటే ముందు ఇక్కడికి వచ్చే యాత్రికుల సంఖ్య చాలా తక్కువ. 2000 నుంచి ఈ సంఖ్య బాగా పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని వివిధ పుణ్యక్షేవూతాల, పర్యాటకస్థలాల సందర్శనకు ప్రతియేటా వస్తున్న టూరిస్టుల సంఖ్య రెండు కోట్ల 80లక్షలు. పెరిగిన టూరిజం భారీగా ఆదాయం సమకూర్చి నప్పటికీ మరో రూపంలో నష్టానికీ కారణమవుతున్నది. టూరిజం అభివృద్ధి పేరిట రహదారులు, భవనాలు,వంతెనల నిర్మాణం కొండల స్వరూపాన్ని మార్చేశారు. ఈ రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్య కూడా పెరగడంతో సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. టూరిజంతోనే వచ్చిన మరో సమస్య అక్రమ నిర్మాణాలు. నదీ తీరానికి 200 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎక్కడంటే అక్కడ విచ్ఛలవిడిగా హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌజ్‌లు వెలుస్తున్నాయి. ప్రభుత్వపరంగా యా త్రికులకోసం తగినన్ని హోటళ్లను నిర్మించకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు ఈ వ్యాపారానికి ఎగబడ్డారు. గంగ, సోంగ్, భగీరథి, అలకానంద, మందాకిని నదీతీరాల వెంట వేలాది అక్రమ నిర్మాణాలు వెలిశాయి. మొన్నటి జలవిలయంలో కేదార్‌నాథ్ వద్ద అనేక మంది అభాగ్యులు ఇలాంటి అక్రమ నిర్మాణాల కిందపడి ప్రాణాలు కోల్పోయినవారేనన్న విష యం మర్చిపోరాదు. ఆందోళన కలిగించే మరో అంశం గనులు, క్వారీల పేరిట విచక్షణారహితంగా సాగుతున్న తవ్వకాలు. ఉత్తరాఖం డ్ రాష్ట్రంగా మారాక రియల్ ఎస్టేట్ పెరిగిం ది. డెహ్రాడూన్‌తోపాటు ఇతర పట్టణాల్లో భవనాలు, రోడ్లు,వంతెనల నిర్మాణం ఎక్కువైంది. ఈ నిర్మాణాల కోసమే కాకుండా పొరుగురాష్ట్రాలైన ఉత్తరవూపదేశ్, రాజధాని ఢిల్లీలకు సైతం ఇసుక సరఫరా ఇక్కడి నుంచే కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 12జిల్లాల్లో పారుతున్న 49చిన్నా పెద్దా నదులు, వాగు ల నుంచి ప్రతి రోజూ వేలాది టన్నుల ఇసుకను తోడేస్తున్నారు. బండరాళ్లను కంకరగా మార్చి తీసుకెళుతున్నారు.అధికారిక లెక్కల ప్రకారమే 2000-2010 మధ్య 9వేల 641ఎకరాల విస్తీర్ణంలో మైనింగ్‌కు అనుమతులిచ్చారు. ఇదికాకుండా మరో 3వేల 971 ఎకరాల్లో తవ్వకాలు జరపడానికి 2012 చివరలో టెండర్లు పిలిచారు. ఫలితంగా నదుల ఉనికికి, అడవులకు, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతున్నది.

చివరగా ముఖ్యమైన విషయం..రోజురోజుకు వేడెక్కుతున్న వాతావరణం హిమాలయాలకు పెనుముప్పుగా మారింది. పరిక్షిశమలు, వాహనాల నుంచి వె లువడే కాలుష్యం, అడవుల నరికివేత, నగరాల విస్తరణ తదితర కారణాల మూలంగా ఇప్పటికే భారత ఉపఖండంలో వాతావరణం మారిపోతున్నది. ప్రత్యేకించి ఉత్తరాఖండ్‌లో ఈ పరిణామం తక్షణ ముప్పుకు దారితీసింది. హిమాలయాల్లోనే పడమటి భాగంలో మంచుకొండలు(గ్లేసియర్లు) యథాతథంగా ఉండగా, తూర్పు న మాత్రం క్రమక్షికమంగా కరుగుతున్నాయని, భారీ సరస్సులు ఏర్పడడమే కాకుండా నదుల ప్రవాహం అనూహ్యంగా పెరిగిపోతోందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం వేడెక్కడం పెరిగిన కొలదీ వానాకాలమంతా విస్తరించి పడాల్సిన వానలు తక్కువ రోజుల్లో ఎక్కువ తీవూవతతో కురుస్తాయని, కుంభవృష్టిలు సాధారణమవుతాయని వారంటున్నారు. మరోవైపు, ఎండాకాలం ఎండలు మరింత మండిపోతాయని వారంటున్నారు. మొన్న కేదార్‌నాథ్ ప్రాంతంలో జరిగిందిదేనని, గంటల వ్యవధిలో కనీవినీ ఎరుగని వర్షం పడిందని అంటున్నారు. ఇకనైనా ఉత్తరాఖండ్, ఢిల్లీ పాలకులు మేల్కోవాలి. అభివృద్ధిని ప్రజల సంక్షేమంతో మేళవించాలి. మానవ మనుగడకే ము ప్పు తెచ్చే అభివృద్ధి ప్రాజెక్టులను తిరస్కరించాలి. భవిష్యత్ తరాల కోసం అడవులను, సహజవనరులను, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. హిమాలయాలపై అన్ని రకాల మైనింగ్‌ను, క్వారీలను నిషేధించాలి. విద్యుత్‌కేంవూదాల, రహదారుల, వంతెనల నిర్మాణాన్ని పర్యావరణ శాఖ పకడ్బందీగా పర్యవేక్షించాలి. నదీతీరాల వెంట ఉన్న అక్రమనిర్మాణాలను కూల్చేయాలి. అప్పుడే ఏడాది పొడుగునా కేదార్‌నాథ్, బద్రీనాథ్, గం గోత్రి తదితర పుణ్యక్షేవూతాలకు వెళ్లే యాత్రికులకు, స్థానికులకు రక్షణ ఉంటుంది.

 

– డి మార్కండేయ

 

Latest News