Friday, July 5, 2024

ఆదివాసులపై మరో ఆక్రమణ..

మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది గంటలకు ఆ జిల్లాకు చెందిన ఏటపల్లి తాలూకాలోని సుర్జాగఢ్ గుట్టల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులను నక్సల్స్ నరికి చంపారు.చనిపోయిన ముగ్గురిలో ఒకరు ప్రముఖ బహుళజాతి సంస్థ లాయిడ్స్ స్టీల్ కంపెనీకి చెందిన ఉన్నతస్థాయి అధికారి.5వేల కోట్ల టర్నోవర్ కలిగిన ఈ కంపెనీ ప్రధానంగా ఉక్కు పరిక్షిశమలను కలిగివున్నది. ఈ కంపెనీకి వైస్‌వూపెసిడెంట్ అయిన జస్పాల్ థిల్లాన్, లాయిడ్స్‌కు అనుబంధంగా ఉన్న హేమలతా మినరల్స్ ఎండీ ఆంధ్రవూపదేశ్‌కు చెందిన మల్లికార్జున్‌డ్డి కలిసి స్థానిక పోలీస్‌ప రాజు సడిమెక్ మధ్యవర్తిత్వంలో మావోయిస్టులతో చర్చలు జరిపేందుకని మంగేర్ గ్రామానికి వెళ్లారు. చర్చల్లో ఏం జరిగిందో తెలియదు. ఓ గంటలో వారి కారు డ్రైవర్ తిరిగొచ్చాడు.మిగతా ముగ్గురు శవాలుగా మారారు. లాయిడ్స్ కంపెనీ సుర్జాగడ్ గుట్టల్లో ఇనుప ఖనిజం మైనింగ్ కాంట్రాక్ట్ కోసం, మరో అనుబంధ కంపెనీ గడ్‌చిరోలి మెటల్స్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ప్రయత్నిస్తున్నదని, ఈ క్రమంలోనే మావోయిస్టులను కలిసేందుకు వెళ్లారని తెలుస్తున్నది. గతంలో థాపర్‌కు చెందిన బల్లార్‌పూర్ పేపర్ మిల్లు(బిల్ట్)లో ఉన్నతాధికారిగా పనిచేసిన థిల్లాన్‌కు నక్సలైట్లతో బాగా పరిచయముందని, ఆ నమ్మకంతోనే వారిని కలువడానికి వెళ్లాడని అంటున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో మైనింగ్‌కు అనుమతించబోమని ప్రకటించిన మావోయిస్టులు ఈ ముగ్గురిని ఎలాంటి చర్చలు లేకుండానే చంపేశారని అధికార వర్గాలు అంటున్నాయి.

మహారాష్ట్రకు తూర్పున ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న జిల్లా గడ్‌చిరోలి. మనం కరీంనగర్ జిల్లా మహదేవపూర్ ప్రాంతం నుంచి ఎక్కడ గోదావరి దాటినా ఈ జిల్లాలోనే ప్రవేశిస్తాం.ఎనభై శాతం ప్రాంతం అడవులు, గుట్టలతో కూడుకొనివున్న ఈ ఆదివా సీ జిల్లాలో అపార ఖనిజ సంపద వున్న ది. జిల్లా మధ్యభాగం లో వున్న సుర్జాగఢ్ గుట్టలు ఇనుప ఖని జం నిల్వలకు ప్రసిది.్ధఈ గుట్టల్లో ఇనుము నిక్షేపాలు వందల మి లియన్ల టన్నుల్లోనే ఉంటాయని సెంట్రల్ జియలాజికల్ ప్రాగ్రామింగ్ బోర్డు(సీజీపీబీ) కమిటీ తేల్చింది. ఈ నిక్షేపాలపై కన్నేసిన డజనుకు పైగా బహుళజాతి కంపెనీల్లో లాయిడ్స్ ఒకటి. ఈ కంపెనీకి వార్ధా, చంద్రపూర్ జిల్లా గుగ్గుస్‌లలో ఉక్కు, స్పాంజ్‌ఐరన్ కర్మాగారాలున్నాయి. వీటికి కావాల్సిన ముడిఇనుము సరఫరాలో కొరతనెదుర్కొంటున్న నేపథ్యంలోనే లాయిడ్స్ కంపెనీ సుర్జాగఢ్ గుట్టలపై దృష్టి సారించింది. తనకూ అక్కడ క్యాప్టివ్ మైన్స్ కావాలని పైరవీలు ప్రారంభించింది. ప్రభుత్వ ఆమోదం దొరికిందనుకున్న సమయం లో మావోయిస్టుల గ్రీన్‌సిగ్నల్ కోసం ప్రయత్నిస్తోంది.

సుర్జాగఢ్ సంపదపై కన్నేసిన కంపెనీల్లో లాయిడ్స్ ఒక్కటే లేదు. ఇప్పటికే జేఎస్‌డబ్ల్యు ఇస్పాట్ స్టీల్ లిమిటెడ్ అనే మరో భారీ కంపెనీ కూడా మైనింగ్ కోసంఅనుమతులు సంపాదించింది. జిందాల్ సోదరులు నవీన్, సజ్జన్‌లు నడిపిస్తున్న ఈకంపెనీ దేశంలోని అతిపెద్ద బహుళజాతి కంపెనీల్లోఒకటి. సుర్జాగఢ్ గుట్టల్లోని దంకోడ్వాడ్వి ప్రాంతంలోని 751.04 హెక్టార్ల విస్తీర్ణంలో గనుల తవ్వకానికి ఈ కంపెనీ కేంద్రప్రభుత్వంతో ఒప్పం దం కుదుర్చుకుంది. దీంతో ఏటా5.5మిలియన్ టన్నుల చొప్పున ఇరవైఏళ్ల పాటు ఖనిజాన్ని వెలికితీస్తారు. ఈ ఖనిజాన్ని మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా డోల్విలో జేఎస్‌డబ్ల్యు ఇస్పాట్ నెలకొల్పిన ఉక్కు ఫ్యాక్టరీకి తరలిస్తారు.

ఇప్పటికే ఈ ప్రాజెక్టు పర్యావరణంపై ప్రభావ అంచనా నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. నియమానుసారం జరగాల్సిన ప్రజాభివూపాయ సేకరణను సైతం మే 8న నిర్వహించారు. త్వరలోనే మహారాష్ట్ర పర్యావరణ నియంవూతణ మండలి(పీసీబీ) ఈ మైనింగ్ ప్రాజెక్టుకు ఆమోదాన్ని తెలుపుతుందన్న ఆశాభావాన్ని జేఎస్‌డబ్ల్యు ఇస్పాట్ ప్రతినిధి రాజు మలానీ వ్యక్తం చేశారు. ఇక్కడే మనం ఒక కీలక అంశాన్ని గమనించాలి. గట్ట, గడ్దెవాడ గ్రామపంచాయతీలకు చెందిన సుమారు 17 గ్రామాల ప్రజలను నిర్వాసితులను చేసే ఈ ప్రాజెక్టును ఆమోదించేముందు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికులను కనీసంగా కూడా సంప్రదించలేదు. ఈ పల్లెలకు 70కిలోమీటర్ల దూరంలో ప్రజాభివూపాయ సేకరణ నిర్వహించారు. దీనిలో బాధిత ప్రజపూవరూ పాల్గొనలేదు. ఈ ప్రజాభివూపాయ సేకరణ గురించిన ప్రకటనను స్థానికంగా అందుబాటులో లేని ఒక ఆంగ్ల, మరో మరాఠీ దినపవూతికల్లో ప్రచురించారు. ఏ ఊర్లోనూ నోటీసులు అంటించలేదు.

గోండి భాష తప్ప మరో భాష రాని స్థానికులకు ఇప్పుడిప్పుడే అసలు విషయం తెలుస్తున్నది. ప్రజాభివూపాయ సేకరణ విషయం తెలిసిన వెంటనే గట్ట గ్రామసభ మే-1న సమావేశమై మైనింగ్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తీర్మానించింది. అయినా జిల్లా యంత్రాంగం ప్రజాభివూపాయం ప్రాజెక్టుకు అనుకూలంగానే ఉన్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. పైగా ప్రాజె క్టు మూలంగా స్థానికంగా అభివృద్ధి జరుగుతుందని, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు లభిస్తాయని, విద్యా వైద్య వసతులు సమకూరుతాయని జోరుగా ప్రచారం చేస్తున్నది. నిజానికి ఈప్రాజెక్టు మూలంగా17ఆదివాసీ పల్లెలకు చెం దిన ఎనిమిది వేల మంది జీవనోపాధి కోల్పోతారు. వీరంతా మాడియా గోండ్ తెగకు చెందినవారు. దేశంలోనే అత్యంత ఆదిమజాతుల్లో ఒకటైన ఈ తెగ ప్రజలు అడవిపైనే ఆధారపడి బతుకుతారు. రోజంతా అడవిలో సంచారం.. రాత్రికి ఆటా పాటలతో వీరి జీవితం ప్రకృతిలో ఆహ్లాదకరంగా సాగిపోతుంది.

ఇప్పపూవు, తదితర పండ్లు-ఫలాలసేకరణ, వెదురు నరకడం, తునికాకుసేకరణ, జంతువుల చేపల వేట, వ్యవసాయం వీరి ప్రధాన వ్యాపకాలు. అడవులు, గుట్టలు లేకుండా వీరి మనుగడ అసాధ్యం. మైనింగ్ మూలంగా ఈ ప్రాంతంలోని అడవి పూర్తిగా నాశనం కావడమే కాకుండా, మరో పది కిలోమీటర్ల పరిధిలో పర్యావరణం నాశనమవుతుందని నిపుణులు అంటు న్నారు. నేల, నీరు, గాలి పూర్తిగా కాలుష్యమవుతాయని, మనుషులకే కాకుండా జంతుజాలానికీ ముప్పేనని వారంటున్నారు. మరోవైపు, పర్యావరణ అధ్యయన నివేదికలో సైతం ఈ అడవుల్లో కోతులు, కొండముచ్చులు, జింకలు, బెట్టుడతలు, కుందేళ్లు, ముంగీసలు, అడవిపిల్లులు, రేసుకుక్కలు, నక్కలు, ఝాడుంలు, ముళ్లపందులు విస్తృతంగా ఉంటాయి. అలాగే అంతరించే ప్రమాదమున్న జాబితాలో ఉన్న పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, తోడేళ్లు,అడవిబపూలు, నాలుగు కొమ్ముల జింకలు అక్కడక్కడా కనిపిస్తాయి.

ఇక ఈ ప్రాజెక్టు వల్ల స్థానికంగా అభివృద్ధి జరుగుతుందన్నదీ అబద్దమే. ఇక్కడి ఆదివాసుల్లో చదువుకున్నవాళ్లు పెద్దగా లేరు కనుక ఉద్యోగాలు రావడం భ్రమే. క్రషిం గ్ అండ్ స్క్రీనింగ్ ప్లాంట్ వల్ల కాలుష్యం తప్ప మరేముండదు. అలాగే ప్రాజెక్టు కోసం సేకరించే రెండు వేల ఎకరాలే కాకుండా మైనింగ్ ప్రక్రియలో బయటపడే ఓవర్ బ్డ న్, రోడ్లు, నిల్వలు వగైరా అవసరాలకు మరె న్నో ఎకరాలను అనధికారికంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది కనుక ఈ 1హగామాల ప్రజ లు అన్ని రకాలుగా ఉపాధి కోల్పోతారు. వ్యవసాయం చేద్దామం భూములు లేక, ఆకో అలమో పొట్ట నింపుకుందామంటే అడవులూ లేక చివరకు ఆ దివాసులందరూ నిరాశ్రయులౌతారు.రోజుకూలీలుగా మారి ఆకలితో అలమటిస్తారు.

ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మైనింగ్ ప్రా జెక్టును వ్యతిరేకిస్తున్నారు. ముప్పైఏళ్లుగా ఈ ప్రాంత ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయిన మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ఉద్యమిస్తున్నారు. శాంతియుత పోరాటాలను అనుమతించని పరిస్థితుల్లో స్థానికులు ఐక్యమై అన్ని కంపెనీల కార్యకలాపాలను, రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. వీరి నిరసనలపై ప్రభుత్వా లు ఉక్కుపాదాన్ని మోపుతున్నాయి. ప్రజాభివూపాయ సేకరణ సందర్భంగా సైతం భారీయెత్తున పోలీసు బలగాలను, కమాండోలను దించారు. మైనింగ్‌ను వ్యతిరేకించే ప్రజావూపతినిధులను సైతం బెదిరింపులకు గురి చేస్తున్నారు. భవిష్యత్‌లో మైనింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తారనే ఉద్దేశంతో ఇప్పటినుంచే మావోయిస్టుల అణచివేతకు చర్యలు చేపడుతున్నారు. సుర్జాగఢ్ పరిసరాల్లో కొత్తగా వందలాది పారామిలిటరీ బలగాలతో క్యాంపులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే థిల్లాన్, మరో ఇద్దరి హత్య జరిగింది.

ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ధి చేసే ముసుగులో స్థానిక వనరులను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టే పాలకుల కుట్రలను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా,జార్ఖండ్ రాష్ట్రాల అటవీ వూపాంతాల్లోని లక్షలాది ఎకరాలను మైనింగ్ ఎంఓయూల పేరిట దేశ, విదేశీ కంపెనీలకు అప్పగించారు. అడవులను ధ్వంసం చేసి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నారు. వాయు, జల, శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారు.వందలాది పల్లెలను మరోచోటికి తరలిస్తున్నా రు. డోంగ్రియా, కుటియా కోందులు, అబూజ్‌మాడియా వంటి అరుదైన ఆదిమతెగల అస్తిత్వానికి ముప్పు తెస్తున్నారు.వానాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వానలు, రుతువుల తారుమారు వంటివన్నీ అడవుల విధ్వంసం ఫలితమే. మనం ఇంకా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని, నీటిని, కనీస జీవన వనరులను సైతం అందించలేని పరిస్థితులు రావడం ఖాయం.అందుకే ప్రపంచీకరణ విధానాల్లో భాగంగా జరుగుతున్న ఈ ఘోరకలిని ఆపడానికి ప్రతి ఒక్కరూ రంగంలోకి దిగాలి. మావోయిస్టులను పారదోలేందుకని చేపట్టిన ఆపరేషన్ గ్రీన్‌హంట్ నిజానికి బహుళజాతి కంపెనీల వనరుల దోపిడికి మార్గం సుగమం చేయడానికేనని గుర్తించాలి. మధ్యభారత అడవులను, సహజవనరులను కాపాడుకోవడానికి సమష్టిగా ఉద్యమించాలి.

-డి. మార్కండేయ

Latest News