Wednesday, July 3, 2024

నక్సలిజంపై ‘కార్పొరేట్’ వార్..

నక్సలిజాన్ని అంతమొందించడంలో బహుళజాతి కంపెనీల సాయం పొందాలని కేంద్రం నిర్ణయించింది. మొన్నటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తావించిన భారత్ రూరల్ లైవ్‌లీహుడ్ ఫౌండేషన్ (బీఆర్‌ఎల్‌ఎఫ్) ఇందుకు ఉద్దేశించినదే. దేశంలోని 170 గిరిజన జిల్లాల అభివృద్ధిలో పౌర సమాజం భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఈ సంస్థను ఏర్పాటుచేస్తున్నట్ల్లు ఆయన పేర్కొన్నారు. నక్సల్ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నవి ఆదివాసీ ప్రాంతాలేనని గుర్తించిన ప్రభుత్వం, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ చొరవతో ఈ ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టింది. కనీసం వేయి కోట్లు సేకరించ తలపెట్టి కార్పస్ ఫండ్‌గా 200 కోట్లు కేటాయించింది. మిగతా నిధులను కార్పొరేట్ కంపెనీ ల నుంచి విరాళాలుగా స్వీకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల జైరాం టాటా, రిలయెన్స్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి బడా వ్యాపార సంస్థలకు లేఖలు రాశా రు. ఫౌండేషన్ లక్ష్యాన్ని, విధి విధానాలను ఆ లేఖల్లో వివరించారు.

ఫౌండేషన్ ప్రభు త్వ సంస్థలా కాకుండా పూర్తి స్వయంవూపతిపత్తితో పనిచేస్తుందని తెలిపారు. చైర్మన్, పూర్తికాలం పనిచేసే సీఈఓ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని వివరించా రు. 200 కోట్లు విరాళంగా ఇచ్చే ప్రతి కంపెనీ ప్రతినిధిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో చేర్చుతామన్నారు. వ్యవసాయం, నీటి వనరుల నిర్వహణ, చేపల పెంపకం, పాడి అభివృద్ధి, అటవీ ఉత్పత్తులు, నైపుణ్యాల మెరుగుదల తదితర రంగాల్లో ఫౌండేషన్ పని చేస్తుందని, స్థానిక ఎన్‌జీఓలకు ఈ పనులపై పర్యవేక్షణ బాధ్యతను అప్పగిస్తామని వివరించారు. బహుళజాతి కంపెనీలు తమ సామాజిక బాధ్యతను విస్మరించరాదని గుర్తు చేస్తూ, మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితులవుతున్న ఆదివాసులను అభివృద్ధి బాట పట్టించడంలో తమకు సహకారాన్ని అందించాల్సిందిగా అర్థించారు.

ప్రజాసేవ కోసం ఏర్పరుస్తున్న స్వచ్ఛంద సంస్థలా కనబడుతున్నా, ఈ ఫౌండేష న్ స్థాపన వెనకాల నిజానికి వేరే కారణాలున్నాయి. దేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పుగా వామపక్ష తీవ్రవాదం పరిణమించిందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మూడేళ్ల కిందట ప్రకటించినప్పటి నుంచి నక్సలైట్లపై, ప్రత్యేకించి మావోయిస్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్విముఖ వ్యూహంతో యుద్ధా న్ని ప్రకటించాయి. ఒకవైపు మావోయిస్టు శ్రేణులను సైనికంగా అణచివేస్తూనే ఇంకోవైపు నక్సల్ ప్రాబల్య ప్రాంతా ల్లో అభివృద్ధి కార్యక్షికమాలు చేపట్టడం ద్వారా ప్రజలను ఉద్యమానికి దూరం చేయడం ఈ ద్వి ముఖ వ్యూహం లక్ష్యం. అణచివేత వ్యూహానికి కేంద్ర హోంమంత్రి చిదంబరం నేతృత్వం వహిస్తే, అభివృద్ధి బాటకు జైరాం రమేష్ సారథ్యం స్వీకరించారు. చిదంబ రం పర్యవేక్షణలో ఇప్పటికే మధ్య భారతంలో ఆపరేషన్ గ్రీన్‌హంట్ కొనసాగుతోంది. లక్షలసంఖ్యలో పారా మి లటరీ బలగాలు దండకారణ్యాన్ని, జంగల్‌మహల్‌ను, సరాండా అడవులను, ఏఓబీని చుట్టుముట్టాయి. అడవులను జల్లెడ పడుతున్నాయి.

అగ్రనేత కిషన్‌జీ మొదలుకొని పలువురు మావోయిస్టు నేతలను, కార్యకర్తలను మట్టుబెట్టాయి. 2009 నవంబర్ నుంచి ఈ పోరు భీకరంగా కొనసాగుతూనేవున్నది. మరోవైపు, అభివృద్ధి నినాదంతో జైరాం నక్సల్ ప్రాంతాల్లో పర్యటిస్తూ మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గ్రీన్‌హంట్‌తో పాటే, ఇంటిక్షిగేటెడ్ యాక్షన్ ప్లాన్ (ఐఏపీ) పేరుతో నక్సల్ ప్రాంతాల అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టారు. 3500 కోట్లు ఖర్చు చేశారు. అయినా ఆ పథకం అనుకు న్న ఫలితాలను సాధించలేకపోయిందనే చర్చ అధికార వర్గాల్లో ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ ఫౌండేషన్ ప్రతిపాదన రూపుదిద్దుకుంది.
బహుళజాతి కంపెనీలు బీఆర్‌ఎల్‌ఎఫ్‌కు దండిగా నిధులు సమకూరుస్తాయని జైరాం చాలా నమ్మకంగా ఉన్నారు. ఇందుకాయన చెబుతున్న కారణాలు రెండు. సామాజిక బాధ్యత నెరవేర్చడం ద్వారా ఇంటా బయటా ఈ కంపెనీల ప్రతిష్ఠ పెరుగుతుంది. ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములు కావడం ద్వారా వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న ప్రభుత్వేతర సంస్థలతో, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడతాయి.

ఫలితంగా ఈ కంపెనీలు ఆయా ప్రాంతాల్లో తమ వ్యాపార కార్యకలాపాలను నిరాటంకంగా కొనసాగించవచ్చు. మంత్రి పైకి చెప్పకపోయినా ఈ రెండు కారణాలకు మించి న బలమైన కారణం మరొకటున్నది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలైన ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాలు ఖనిజవనరులకు నిలయాలు. దేశంలో ఉన్న మొత్తం ఖనిజవనరుల్లో సింహభాగం ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇనుము, బాక్సైట్, మాంగనీస్, రాగి, బొగ్గు, జిప్సం, యురేనియం, లైమ్‌స్టోన్, కొరండమ్, డైమండ్ తదితర విలువైన ఖనిజాలు ఇక్కడ పుష్కలం. ఒక్క ఒరిస్సాలోనే రెండు వందల లక్షల కోట్ల బాక్సై ట్ నిల్వలు ఉన్నాయంటే మధ్యభారతం ఎంత విలువైనదో అర్థం చేసుకోవచ్చు. టాటా, జిందాల్, మిట్టల్, ఎస్సార్, హిందాల్కో, వేదాంత, పోస్కో వంటి అనేక బహుళజాతి కంపెనీలు ఈ ప్రాంతాల్లో విస్తృతంగా మైనింగ్, పారిక్షిశామిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2009 సెప్టెంబర్ నాటికే ఇక్కడ 8లక్షల 73వేల 896 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు వివిధ కంపెనీలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి.

ఈ కంపెనీలన్నింటికీ స్థానికంగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమమే ప్రధాన శత్రువు. ఎందుకంటే.. వీరు చేపట్టిన ప్రాజెక్టుల మూలం గా నిర్వాసితులయ్యే బాధితుల పక్షాన నిలబడడమే కాకుండా అడవిపై, అడవిలోని వనరులపై ఆదివాసీలకే హక్కుందని మావోయిస్టులు పోరాడుతున్నారు. వీరి ఆస్తులపై దాడులకు పాల్పడుతున్నారు. నక్సల్స్ దాడుల మూలంగా కేవలం పవర్, స్టీల్ ప్లాంట్లలోనే 20 వేల కోట్ల పెట్టుబడులు స్తంభించిపోయాయని అనధికార వర్గాల అంచనా.

మావోయిస్టు ఉద్యమం వల్ల ఎక్కువగా నష్టపోతున్నది ఈ బహుళజాతి కంపెనీలేనన్నది స్పష్టం. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్‌హంట్ ప్రారంభించ డం వెనకాల ఈ కంపెనీల ప్రోద్బలమే ఉన్నదని మావోయిస్టు పార్టీ మొదలుకొని అరుంధతీరాయ్ లాంటి మేధావుల వరకు అనేకులు ఆరోపిస్తున్నారు. మధ్య భార తంలోని వనరులపై కన్నేసిన ఈ సంస్థలు అమెరికా తదితర దేశాలు, ప్రపంచబ్యాంకు వంటి సంస్థలతో భారత ప్రభుత్వంపై ఒత్తిడి తూవడమే కాకుండా యూపీఏ సర్కారుతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయని వీరు ఆరోపిస్తున్నారు. ఇంతకాలం తెర వెనుక పాత్ర పోషించిన ఈ కంపెనీలను ఫౌండేషన్ ప్రతిపాదనతో జైరాం తెర ముందుకు తెస్తున్నారు. ఆయన ఆశించిన విధంగానే ఈ ఫౌండేషన్‌కు ఆయా కంపెనీలు భారీగా నిధులు సమకూరుస్తాయనే విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. వేయి కోట్లు కాస్తా రేపు పది వేల కోట్లకు పెరగవచ్చు కూడా.

ప్రశ్నల్లా ఈ ఫౌండేషన్ ద్వారా విడుదలైన నిధులు వెనుకబడిన ఆదివాసీ ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయా! ఎందుకంటే, ఇప్పటివరకు గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసమని ప్రభుత్వాలు విడుదల చేసిన ఏ నిధులూ వారి బతుకులను మార్చేందుకు ఉపయోగపడలేదు. ఐఏపీ పేరుతో విడుదలైన 3500 కోట్లు కూడా కేవలం రోడ్లు, వంతెనలు, పోలీస్‌స్టేషన్ల నిర్మాణానికి ఖర్చు చేశారే తప్ప ఏ ఒక్క పైసా స్థానికులకు మౌలిక వసతులను కల్పించడానికి ఖర్చు చేయలేదు. గతంలో మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లాలో వాటర్‌షెడ్ పేరిట సర్కారు మంజూరు చేసిన నిధులతో ఆయా గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు నిర్మించి అందులో కలర్ టీవీలు అమర్చిన సంగతి అక్కడి ప్రజలు ఇంకా మరచిపోలేదు.

ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ భారత్ ఫౌండేషన్ నిధులు కూడా ఆదివాసుల తలరాతలను మార్చడానికి వినియోగించే దాఖలాలు కనిపించడం లేదు. జైరాం చెప్పిన ప్రకారమే ఫౌండేషన్ నిధులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కాకుండా నేరుగా స్థానికంగా పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలు, పౌరసంఘాలకు విడుదలవుతాయి. ఆ సంస్థల ద్వారానే వివిధ ప్రజావసరాలకు, పనులకు ఖర్చు చేస్తారు. ఫౌండేషన్ పెద్దలు అర్హులని భావించిన వారికి ఈ పనులు దక్కుతాయన్నమాట. ఇక్కడే ప్రభుత్వ కుట్ర బహిర్గతమవుతోంది. ఇప్పటి వర కు గిరిజన పల్లెల్లో మావోయిస్టులదే రాజ్యం. వారి కదలికలను గురించిన సమాచారమిచ్చే మానవ మావూతుడే లేడు కనుక, ‘స్వచ్ఛందసంస్థల’ ముసుగులో నిధులు వెదజల్లి తమకు అనుకూలమైన ఒక వర్గాన్ని తయారుచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఆదివాసుల్లో నిరుద్యోగులను చేరదీసి వివిధ పథకాల పేరుతో వారికి విలాస జీవితాన్ని అలవాటు చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే నిష్కల్మషంగా,బతుకుతున్న ఆదివాసీలకు స్వార్థం నేర్పుతారు. అప్పుడిక చట్టం తన పని తాను చేసుకువెళుతుంది.
వెనుకబడిన ప్రాంతాల, ఆదివాసుల అభివృద్ధి ద్వారానే నక్సలైటు ఉద్యమాన్ని రూపుమాపవచ్చని కేంద్ర ప్రభుత్వం నమ్మితే, అది అభినందిచాల్సిన విషయమే. అలాంటప్పుడు మధ్యభారతంలో కొనసాగుతున్న గ్రీన్‌హంట్‌ను వెంటనే ఆపేయా లి. ఓ చేత్తో అన్నం ముద్దను అందిస్తూ, మరో చేత్తో రైఫిల్ బాయ్‌నెట్‌ను ఎక్కుపెట్టే విధానాలకు పాలకులు స్వస్తి చెప్పాలి. మావోయిస్టులతో కాల్పుల విరమణను ప్రకటించి, విప్లవ గ్రూపులన్నింటిని శాంతి చర్చలకు ఆహ్వానించాలి. మధ్యభారతంలోని ఖనిజవనరుల విషయంలో బహుళజాతి కంపెనీలతో కుదుర్చుకున్న అన్ని ఎంఓయూలను పునస్సమీక్షించాలి. అభివృద్ధి ఫలాలను స్థానికులకు అందించే ‘మినరల్’ పాలసీని ప్రకటించాలి. ‘స్వదేశీ’ బాటలో దేశాన్ని పారిక్షిశామికీకరించాలి. పేదరిక నిర్మూలనకు, మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో, పంచవర్ష ప్రణాళికల్లో అధికనిధులు కేటాయించాలి. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలుచేయాలి. అప్పుడు మావోయిజం దానంతటదే సమసిపోతుంది.

 

-డి. మార్కండేయ

 

Latest News