Wednesday, July 3, 2024

పతనం అంచున అస్సద్!

అఫ్ఘనిస్తాన్.. ఇరాక్.. లిబియా.. ఇరాన్.. ఉత్తర కొరియా.. అమెరికా ఆగ్రహానికి గురైన దేశాల జాబితాలో తాజాగా సిరియా చేరింది. తనకు నచ్చితే పచ్చి నియంతనైనా గొప్ప ప్రజాస్వామికవాదిగా, నచ్చకపోతే ప్రజాదరణ గల నేతను కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకిగా ముద్రవేసే అగ్రరాజ్యానికి ఇప్పుడు సిరియా పాలకుడు హఫెజ్ అల్ అస్సద్‌పై కోపమొచ్చింది. అంతే.. ఆ దేశం ఉగ్రవాదులకు స్థావరంగా మారిపోయినట్టు అమెరికాకు కనిపించింది. ఇరాక్, లెబనాన్ తదితర దేశాల్లో అనర్థాలకు ఆ దేశమే మూలమైంది. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుండడం కనిపించింది. అణ్వాయుధాల తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయనడానికి ఆధారాలు లభించాయి. ఈ ‘సాక్ష్యాలను’ గత సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ముందుంచింది. తక్షణం సిరియాపై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రతిపాదించింది. ఇందుకు రష్యా, చైనాలు సమ్మతించకుండా వీటో హక్కును వినియోగించుకోవడంతో, దొడ్డిదారిన సిరియా మెడలు వంచడానికి తన నాటో మిత్రులతో రహస్యంగా మంతనాలు ఆరంభించింది. అస్సద్‌ను గద్దె దింపడానికి సైనిక జోక్యం తప్పకపోవచ్చని ప్రతిపాదించింది. సిరియా ప్రతిపక్షాన్ని సాయుధం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక మానవ కారిడార్‌ను సృష్టించేందుకు బలగాలను పంప డం, వైమానిక దాడులకు పూనుకోవడం మన ముందున్న మార్గాలని చెప్పుకొచ్చింది. అందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిశీలకులు, అమెరికా యుద్ధోన్మాదంపై లెక్కలు వేసుకుంటున్నారు. అధ్య క్ష ఎన్నికలు సమీపించడంతో తాను శక్తిమంతుడినని పేరు తెచ్చుకోవడం ఒబామాకు చాలా అవసరమని, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయం వెనకాల సిరియాపై దాడి పథకం దాగుందని వారంటున్నారు. ఇరాన్‌పై తలపెట్టబోయే దాడికి ఇది రిహార్సల్‌గా కూడా పనికి వస్తుందని పెంటగాన్ భావిస్తున్నట్లు వివరిస్తున్నారు.

సిరియాపై అమెరికా ఆగ్రహానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. శతాబ్దాలుగా ఒట్టోమన్ల పాలనలో ఉన్న సిరియా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతి కాలంలో ఫ్రెంచ్ వలస గా మారింది. 1946లో స్వాతంత్య్రం పొందింది. ఆ తర్వాత పదేళ్లలో వరసగా 20 ప్రభుత్వాలు మారాయి. 1956లో ‘సూయెజ్ సంక్షోభం’ లో భాగంగా ఇజ్రాయెల్, బ్రిటన్, ఫ్రెంచ్ బలగాలు ఈజిప్టును ఆక్రమించుకున్న నేపథ్యంలో సిరియా రక్షణ కోసం అప్పటి మరో అగ్రరాజ్యం సోవియట్ యూనియన్ పంచ న చేరింది. పొరుగు దేశం టర్కీ నాటోలో చేరడంతో ఈ చర్య సిరియాకు తప్పనిసరైంది. 1957లో సీఐఏ ఆధ్వర్యంలో సిరియా ప్రభుత్వాన్ని కూల్చడానికి జరిగిన కుట్ర అమెరికా-సిరియాల మధ్య శతృత్వానికి బీజం వేసింది. 195 ఫిబ్రవరిలో సిరియా ఈజిప్టుతో ఐక్యమై యునైటె డ్ అరబ్ రిపబ్లిక్‌గా ఏర్పడింది. ఈ ఐక్యత కేవలం మూడున్నరేళ్లు కొనసాగి 1961 సెప్టెంబర్‌లో జరిగిన సైనిక తిరుగుబాటుతో అంతమైంది. కొత్త పాలకులు సిరియన్ అరబ్ రిపబ్లిక్‌ను ఏర్పరచారు. 1963 మార్చ్ న అరబ్ సోషలిస్టు బాత్ పార్టీ మద్దతుదారులైన సైనికాధికారులు అధికారం చేజిక్కించుకుని అమీన్ హఫీజ్‌ను అధ్యక్షునిగా ప్రకటించారు. 1966లో బాత్ పార్టీలో అంతర్గతంగా తిరుగుబాటు జరిగి రెండు ముక్కలైంది. హఫీజ్‌ను గద్దె దింపి పౌర ప్రభుత్వాన్ని ఏర్పరచారు. ఈ సర్కారులోనే తర్వాతి కాలంలో 30 ఏళ్ల పాటు సిరియాను పాలించిన హఫెజ్ అల్ అస్సద్ రక్షణమంత్రిగా చేరారు. 1967 జూన్‌లో ఈజిప్టు-ఇవూజాయెల్ మధ్య మొదలైన యుద్ధంలో సిరియా ఈజిప్టు పక్షాన చేరింది. ఈ యుద్ధంలో గోలన్ హైట్స్‌ను సిరియా కోల్పోయింది. యుద్ధానంతర పరిణామాల్లో 1970 నవంబర్ 13న రక్తపాత రహిత తిరుగుబాటులో అస్సద్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 1973 మార్చ్‌లో కొత్త రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చిన అస్సద్ సిరియాను సెక్యులర్ సోషలిస్టు రాజ్యంగా ప్రకటించారు. మొట్టమొదటి సారిగా పీపుల్స్ కౌన్సిల్‌ను ఏర్పరచి ఎన్నికలు నిర్వహించారు. 1986లో ఇజ్రాయెలీ విమానం పేల్చివేత యత్నంలో సిరియా హస్తం ఉందన్న ఆరోపణపై అమెరి కా తన రాయబారిని సిరియా నుంచి వెనక్కిపిలిచింది. 1987లో అబూనిదల్ సంస్థ పై సిరియా దేశ బహిష్కరణ విధించడంతో రాయబార సంబంధాల పునరుద్ధరణ జరిగింది.

1990లో కువైట్ ఆక్రమణ నేపథ్యంలో ఇరాక్‌పై అమెరికా నాయకత్వంలో 34 దేశాల కూటమి చేసిన దాడిలో సిరియా పాల్గొనడం కొత్త రాజకీయాలకు తెరతీసింది. లెబనాన్‌లో బందీగా ఉన్న పశ్చిమ దేశస్తులను విడిపించడానికి సిరియా తోడ్పడింది. అంతరించిపోతున్న సోవియట్ ప్రభావం నుంచి సిరియా బయటపడి అమెరికా పక్కన చేరుతోందన్న సంకేతాలు వెలువడ్డాయి. క్లింటన్ కాలంలో మధ్యవూపాచ్యంలో శాంతిని నెలకొల్పడంలో సిరియాను భాగం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. 9/11 దాడుల తదనంతరం ఉగ్రవాదంపై యుద్ధంలో సిరియా అమెరికాకు సాయం చేసింది. బహ్రెయిన్‌లోని అమెరికా నావికా స్థావరంపై అల్‌ఖైదా తలపెట్టిన గ్లైడర్ దాడి గురించి సిరియా ముందే అలర్ట్ చేసింది. అయితే 2002లో ఇరాక్‌పై అమెరికా చేసిన దాడిని సిరియా వ్యతిరేకించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. జిహాద్ ఉగ్రవాదులు సిరియా సరిహద్దుల గుండా ఇరాక్‌లోకి ప్రవేశించారని, సిరియాలో సద్దాం అనుచరులు తలదాచుకున్నారని అమెరికా ఆరోపించింది. 2005 ఫిబ్రవరిలో లెబనాన్ ప్రధాని హత్య అనంతరం ఈ సంబంధాలు మరింత క్షీణించాయి. అమెరికా తన రాయబారిని సిరియా నుంచి వెనక్కి పిలిచింది. అప్పటి నుంచి నేటి వరకూ ఇరు దేశాల మధ్య సంబంధాలు శత్రుపూరితంగానే కొనసాగుతున్నాయి.
అమెరికా ప్రకటించిన ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో 1979 నుంచీ సిరియా పేరుంది. అప్పటి నుంచే కొన్ని రకాల వస్తువుల ఎగుమతులు-దిగుమతులపై, వివిధ ప్రాజెక్టుల కింద అమెరికా చేసే మానవతా సాయంపై, సైనిక సామా గ్రి కొనడంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

2006లో కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ సిరియాను నిషేధించారు. 2010 మేలో ఆహారం, మందులు మినహా మిగతా అన్ని వస్తువులకు ఈ ఆంక్షలను విస్తరించారు. 2010 ఏప్రిల్‌లో లెబనాన్‌లోని హిజ్బుల్లాకు సిరి యా స్కడ్ క్షిపణులు సరఫరా చేసిందని అమెరికా ఆరోపించింది. 2011 ఆగస్టు 11న అమెరికాలోని అన్ని రకాల సిరియా ఆస్తులను స్తంభింపజేస్తూ, అమెరికా పౌరుపూవరూ సిరియా సర్కారుతో వ్యవహారాలు నడపకుండా, అక్కడ పెట్టుబడులు పెట్టకుండా చమురు ఉత్పత్తుల దిగుమతిని నిషేధిస్తూ ఒబామా ఆదేశాలు జారీ చేయడం తో ఆంక్ష ల పర్వం క్లైమాక్స్‌కు చేరింది. సిరియాపై తమ ఆగ్రహానికి అమెరికా, ఇతర నాటో దేశా లు చెబుతున్న ప్రధాన కారణాల్లో అక్కడ కొనసాగుతున్న ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని అస్సద్ ప్రభుత్వం అతి క్రూరంగా అణచివేస్తోందన్నది ముఖ్యమైనది. ఇప్పటికే 400 మంది పిల్లలు సహా మూడు వేలకు పైగా అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నారని, 600 మంది చిత్రహింసలతో జైళ్లలో చనిపోయారని, లక్షా 30 వేలమంది దేశం విడిచి పారిపోయారని ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఓ సద్దాం హుస్సేన్‌లాగే హఫెజ్ అల్ అస్సద్, ఆయన కుమారుడు బషెర్ అల్ అస్సద్ అయినా అమెరికా మాటల్లో చెప్పాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకులు కాదు. అరబ్ ప్రపంచంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఇజ్రాయెల్ జియోనిజానికి, ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా నిలబడి విశాల ప్రజానీకం అభిమానం పొందిన నేతలు. 40 ఏళ్లుగా సిరియాను అస్సద్ కుటం బం ఏకఛవూతాధిపత్యంగా పాలించిందంటే అందుకు ప్రజల్లో బలంగా ఉన్న ఈ జాత్యాభిమానం, ఇజ్రాయెల్ వ్యతిరేక వాదమే కారణం. బషెర్ పగ్గాలు చేపట్టిన తర్వాత 2005 నుంచి సిరియాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమం మొదలైంది. నిరంకుశ, నియంతృత్వ విధానాలకు బషెర్ స్వస్తి చెప్పాలని, ప్రజాస్వామ్య సంస్కరణలు చేపట్టాలని ఉద్యమకారులు అంటున్నారు. ఈ ఉద్యమం 2011లో తీవ్రమైంది. అరబ్ గర్జనగా మొదలైన విప్లవా లు ట్యునీషియా, ఈజిప్టు, లిబియా తదితర దేశాలకు పాకి సిరియా ప్రజలకూ స్ఫూర్తినిచ్చాయి. ఆ స్ఫూర్తితోనే ప్రస్తు తం అక్క డ అస్సద్‌ను గద్దె దించే ఉద్య మంగా కొనసాగుతోంది.

ఈ ఉద్యమానికి తనదైన రీతిలో కీలక మలుపునిచ్చిం ది అమెరికా. లిబియా తరహాలోనే అస్సద్‌ను దింపేసి తన కు కీలుబొమ్మగా వ్యవహరించే సర్కారుకు పగ్గాలు అప్పగించడానికి పావులు కదిపింది. ఉద్యమంలో అమెరికా అనుకూల శక్తులను గుర్తించి వారికి ఆర్థిక సాయమందించింది. సాయుధం చేసింది. వికీలీక్స్ ఈ కేబుల్స్‌ను బహిర్గతం చేసింది. సిరియాలో అమెరికా రాయబారి ఫోర్డ్ వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ తిరుగుబాటు వర్గాలను రెచ్చగొట్టారని స్వయంగా సీఐఏ మాజీ అధికారి మైఖేల్ షూయర్ వెల్లడించాడు. ఇన్ని చేసినా ప్రతిపక్షం బలంగాలేని కారణంగా అమెరికా లక్ష్యం నెరవేరలేదు. దీంతో సిరియాపై తన దుష్ప్రచారాన్ని అమెరికా తీవ్రం చేసింది. ఆ దేశం ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారిందని, ఇరాక్, లెబనాన్ తదిత ర దేశాల్లో జరుగుతున్న అమెరికా వ్యతిరేక దాడులన్నింటి వెనుక ఆ దేశ హస్తమున్నదని అంటోంది. ఇస్లామిక్ జిహాద్, హమాస్, హిజ్బుల్లా, ముస్లిం బ్రదర్‌హుడ్, పీఎఫ్‌ఎల్‌పీ వంటి సంస్థలు సిరియాలో ఆశ్రయం పొందుతూ దాడులకు పూనుకుంటున్నాయని ఆరోపిస్తోంది. నాటో దేశాలతో కలిసి సిరియాపై దాడి చేయడానికి అవసరమైన ప్రాతిపదికను తయారుచేసుకుంటోంది.

తను చెప్పినట్లు వినే దేశాలకో న్యాయం, వినని దేశాలకు మరో న్యాయమనే విధానాలను అమెరికా ఇకనైనా మానుకోవాలి. సిరియాకో నీతి, ఇజ్రాయెల్‌కు మరోనీతి అవలంబిస్తే బలయ్యేది ప్రపంచ శాంతేననే విషయాన్ని గుర్తించాలి. తమ పాలకులు గా ఎవరుండాలో, నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలను ఎలా గద్దె దించాలో ఆయా దేశాల ప్రజలకు తెలుసు. దీనిపై వారికి అమెరికా సలహాలు, సహాయాలేమీ అక్కర్లేదనే విషయాన్ని అంగీకరించాలి. ఇజ్రాయెల్‌కు దన్నుగా మధ్యవూపాచ్యంలో ఆడుతున్న యుద్ధ క్షికీడలకు స్వస్తి చెప్పాలి. బేషరతుగా అఫ్ఘనిస్తాన్ నుంచి తన బలగాలను ఉపసంహరించుకోవాలి. ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించి ఆ దేశంపై యుద్ధ సన్నాహాలను విరమించుకోవాలి. లేదంటే ప్రపంచదేశాల ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తారు. అప్పుడు సిరియా మరో అఫ్ఘనిస్తాన్, ఇరాన్ మరో వియత్నాం కాక తప్పదు.

 

  • డి మార్కండేయ

Latest News