Wednesday, July 3, 2024

మురికి వాడలపై ‘మమత’ కరువు!

కోల్‌కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్దూర్‌పల్లి, శ్రామిక్‌కాలనీల్లోని 200 గుడిసెలను మార్చ్ 30న కోల్‌కతా మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కేఎండీఏ) అధికారులు కూల్చివేశారు. తమకు నిలువ నీడ లేకుండా చేయవద్దని స్థానికులు నెత్తీ నోరూ బాదుకున్నా కనికరం చూపించలేదు. వందలాది మంది సాయుధ పోలీసుల పహరాలో నిర్మాణాలను బుల్డోజర్లు కూల్చివేస్తుంటే ఇళ్లల్లోని సరుకు, సామాక్షిగిని మున్సిపల్ సిబ్బం ది కాల్చివేశారు. ఫలితంగా వేయి మందికి పైగా నిరుపేదలు ఉన్నపళంగా రోడ్డున పడ్డారు. ‘మా..మట్టీ.. మనుష్..’ నినాదంతో, సింగూరు, నందిగ్రాం పోరాటాల స్ఫూర్తితో బెంగాల్ తలరాతను మార్చే పాలననందిస్తానంటూ అధికారంలోకి వచ్చిన దీదీ మమతా బెనర్జీ హయాంలో ఇలా జరగడమేమిటని నివ్వెరపోయిన జనం, ఆ వెంటనే కోలుకుని ఉద్యమబాట పట్టారు.

ప్రభుత్వ భూమి అయినంత మాత్రాన ప్రత్యామ్నాయం చూపించకుండా, కనీసం ముందస్తు నోటీసు ఇవ్వకుండా దొంగల్లాగా దాడి చేయడం అన్యాయమని ప్రభుత్వ చర్యను నిలదీస్తున్నారు. పునరావా సం కల్పించకుండా ఈ గుడిసెల నుంచి ఖాళీ చేయించబోమని హామీలిచ్చిన మంత్రులు ఎక్కడ దాక్కున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. తమకు గృహవసతి కల్పిం చే వరకూ అక్కడ నుంచి కదలబోమని భీష్మించుక్కూర్చున్నారు. కూల్చివేతలు కొనసాగిన ప్రాంతంలోనే తాత్కాలికంగా టెంట్లను ఏర్పాటుచేసుకుని బైఠాయించారు. ఉఛేడ్ ప్రతిరోధ్ కమిటీ (కూల్చివేతల ప్రతిఘటన కమిటీ)ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. పలు ప్రజా సంఘాలు, మేధావులు వీరికి సంఘీభావం ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉక్కుపాదం మోపి వీరి పోరాటాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తోంది.

ఏప్రిల్ 4న నోనదంగా వాసులు చేపట్టిన నిరసన ర్యాలీపై పోలీసులు, తృణమూ ల్ గూండాలు విరుచుకు పడ్డారు. ఈ ఘటనలో ఓ గర్భిణి, మరో పసిబాలుడు సహా పలువురు గాయపడ్డారు. న మరోమారు భారీ ప్రదర్శన తలపెట్టగా, పోలీసులు 69 మందిని అరెస్టు చేసి అందులో పలువురిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారు. వెనక్కి తగ్గని నిరసనకారులు మరునాడు మళ్లీ ప్రదర్శనకు సిద్ధం కాగా మరో 91 మందిని అరెస్టు చేశారు. ఆ తర్వాత రోజుల్లోనూ నిర్వాసితులు ర్యాలీలు, ధర్నాలు, దీక్షలను కొనసాగిస్తుండగా అదే స్థాయిలో పోలీసుల అరెస్టులు, తృణమూల్ కార్యకర్తల దౌర్జన్యాలూ కొనసాగుతున్నాయి. స్థానికులతో పాటు వారి పోరాటానికి మద్దతునిస్తున్న ప్రజాసంఘాల నేతలను, ప్రముఖ మేధావులను సైతం పోలీసులు నిర్బంధిస్తున్నారు. వివాదం రోజురోజుకూ ముదురుతున్నది.
ఇక్కడ నోనదంగా ప్రత్యేకత గురించి చెప్పుకోవాలి.

ఏ మురికివాడ అయినా సాధారణంగా బతుకుదెరువు వేటలో ఉట్టిచేతులతో పట్టణాలకు వలస వచ్చిన కూలీ లు, నిరుపేదలు నిలువ నీడ కరువైన స్థితిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలోనో, మురికికాలువ ఒడ్డునో, రైల్వే ట్రాక్ పక్కనో, చెరువుశిఖంలోనో గుడిసెలు, టెంట్లు వేసుకున్న ఫలితంగా ఏర్పడుతుంది. నోనదంగా మురికివాడ మాత్రం అలా ఏర్పడలేదు. నగరాన్ని సుందరీకరించడంలో భాగంగా కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అనేక మురికివాడలను తొలగించిన కారణంగా ఏర్పడింది. పట్టణ పేదలకు మౌలిక వసతుల కల్పన పథకం(బీఎస్‌యూపీ) పేరిట అప్పటి వామపక్ష ప్రభుత్వం నగరం నడిమధ్యలో గల మురికివాడల నుంచి పేదలను ఖాళీ చేయించి శివారులో ఉన్న నోనదంగాలో పునరావాసం కల్పించింది. కేవలం 160 చదరపు అడుగుల విస్తీర్ణంతో అచ్చం అగ్గిపెట్టెల్లాంటి గదులు కలిగిన అపార్ట్‌మెంట్లను నిర్మించింది. ఒక్కో కుటుంబానికి కేవలం ఒకే గదిని కేటాయించింది. టాయిపూట్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను కూడా కల్పించకపోవడంతో కాలక్షికమంలో నోనదంగా ‘అధికారిక’ మురికివాడగా మారిపోయింది.

ప్రభుత్వమే ఈ స్థలాన్ని చూపించింది కనుక ఇక్కడ గుడిసెలు వేసుకుంటే.. అధికారులు వచ్చి కూల్చివేయడముండదనే ధీమాతో ఆ తర్వాతికాలంలో నగరం నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచీ ఉపాధి కరువైన ఇళ్లు లేని అభాగ్యులు వచ్చి ఇక్కడి ఖాళీస్థలాల్లో గుడిసెలేసుకున్నారు. వరుస కరువు మూలంగా అప్పుల పాలై, భూములు అమ్ముకున్న రైతులు.. ఆసరా కరువైన చేతివృత్తుల వాళ్లు.. తుపాను బాధితులు.. ఇలా అనేకమంది తరలిరావడంతో కొద్దికాలంలోనే నోనదంగా జనాభా భారీగా పెరిగింది. అనేక కాలనీలుగా విస్తరించింది.

అయితే, ఒకప్పుడు కోల్‌కతాకు శివారుగా ఉన్న నోనదంగా ఇప్పుడు నగరం నడిబొడ్డుగా మారడం అక్కడి పేదల పాలిట శాపంగా దాపురించింది. మహానగరంలో ని ఖాళీ స్థలాలన్నింటినీ మింగేసిన రియల్ భూతం నోనదంగాపై కన్నేసింది. కోల్‌కతాను లండన్‌గా మార్చడం తన చిరకాల స్వప్నమంటూ చెప్పిన మమత అధికారంలోకి రావడం వారికి కలిసివచ్చింది. ఇంకేం.. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పేరిట నోనదంగాలో ఉన్న 0 ఎకరాల కేఎండీఏ స్థలాన్ని 99 సంవత్సరా ల లీజుకు కార్పొరేట్‌కు కట్టబెట్టారు. మల్టీప్లెక్స్‌లు, షాపింగ్‌మాళ్లు, స్టార్ హోటళ్లు, బహుళ అంతస్తుల గృహసముదాయాలను నిర్మించడానికి పథకాలు రచించారు. అందులో భాగంగానే మజ్దూర్‌పల్లి, శ్రామిక్‌కాలనీలపై బల్దియా అధికారగణం యుద్ధం ప్రకటించింది. కాగా, కూల్చివేతలు.

ఇంతటితో ఆగిపోదని వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు చెబుతున్నారు. లాకేపల్లి, భాయ్‌భాయ్ కాలనీ, సుభాస్‌పల్లి, బాస్తుహర కాలనీ వంటి అన్ని (మురికి వాడలు) పేదలకాలనీలనూ కూల్చివేయడానికి కుట్ర జరిగిందంటున్నారు. మజ్దూర్‌పల్లి, శ్రామిక్‌కాలనీలు కేవలం 19 ఎకరాల స్థలంలోనే విస్తరించివుండగా, లీజు ఒప్పందంలో 0 ఎకరాల స్థలమని పేర్కొనడంలోనే ఈ కుట్ర దాగుందని పేర్కొంటున్నారు.

విచివూతమేమిటంటే.. బెంగాల్‌లో సుదీర్ఘకాలం కొనసాగిన లెఫ్ట్ ఫ్రంట్ పాలనను కూలదోయడంలో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి ఇతోధికంగా తోడ్పడినవి సింగూరు, నందిగ్రాం ఉద్యమాలు. ఈ రెండు ఉద్యమాలు కూడా అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో మూలవాసులను నిర్వాసితులను చేయడానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు. ఈ ఉద్యమాల్లో మమత కీలక పాత్ర పోషించారు. బుద్ధదేవ్ సర్కారు పై సమరశంఖం పూరించారు. మావోయిస్టులతో సైతం దోస్తీ చేసి పోరాటాన్ని క్రియాశీలంగా నడిపించారు. చివరకు ఆ ప్రాజెక్టులను రద్దు చేయించారు. ఇప్పుడు నోనదంగాలోనూ సింగూరులో, నందిక్షిగాంలో జరిగిందే జరుగుతున్నదని బెంగాల్ మేధావిలోకం కోడై కూస్తున్నది. ప్రత్యామ్నాయం చూపకుండా వేలాది మంది నిరుపేదలను నిరాక్షిశయులను చేయడం అక్రమమంటున్నది. సింగూరుకో న్యాయం, నోనదంగాకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నది. ప్రతిపక్షంలో ఉండగా నిర్వాసితుల పక్షాన నిలబడ్డ మమత అధికారంలోకి రాగానే కార్పొరేట్లకు అనుకూలంగా మారి అభివృద్ధి జపం చేయడమేమిటని నివ్వెరపోతున్నది. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ ముసుగు తొలగడానికి దశాబ్దాలు పడితే, మమత తృణమూల్ అసలురంగు కేవలం ఏడాదికాలంలోనే బయటపడిందని మేధావులు విమర్శిస్తున్నారు.

అయితే, ఇది ఒక్క నోనదంగా సమస్య కానే కాదు. అభివృద్ధి పేరిట, సుందరీకరణ పేరిట దేశంలోని అన్ని నగరాల్లోనూ మురికివాడల్లో నివసించే పేదలను నిరాక్షిశయులు చేసే ప్రక్రియ ప్రపంచీకరణానంతర కాలంలో విచ్చలవిడిగా కొనసాగుతున్నది. నగరాల నడిమధ్యలో గల మురికివాడల స్థానంలో కార్పొరేట్ షాపింగ్‌మాళ్లు వెలుస్తున్నాయి. ప్రశ్నించిన నిర్వాసితులపై రాజ్యం ఉక్కుపాదం మోపుతున్నది. ఢిల్లీలోని ఆనంద్‌పర్బత్ ప్రాంత మురికివాడలను ఇటీవల తొలగించగా, ఘర్ బచావో మోర్చా ఏర్పడి పోరాటం కొనసాగిస్తున్నది. బెంగుళూరులోని ఇజిపురాలోనూ మార్చ్‌లో మురికివాడలను కూల్చివేయగా నిర్వాసితులు సంఘటితమై ఉద్యమించారు. ముంబయిలోని ధరావి, గోలిబార్, నేతాజీనగర్, పడాల్‌వస్తిలో, చెన్నైలోని మాంబలం, నోచికుప్పంలో, ఇతర అనేక నగరాల్లోని మురికివాడల్లో ఇలాంటి అనేక ఘటనలు గతంలో జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో సైతం భీంరావుబాడ, నాగమయ్యకుంట, బతుకమ్మకుంట, శంకర్‌నగర్ తదితర మురికివాడల్లో కూల్చివేతలు కొనసాగాయి. ఒకచోట ఆశ్రయం కోల్పోయిన పేదలు మరోచోట మరో మురికివాడలో తలదాచుకుంటున్నారు.

2010లో నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) సేకరించిన వివరా ల ప్రకారం దేశంలోని 5వేల 161 పట్టణాలు, నగరాల్లో 49 వేల మురికివాడలున్నాయి. వీటిల్లో సుమారు 9కోట్ల 30 లక్షల మంది ప్రజలు దుర్భర పరిస్థితుల్లో బతుకులీడుస్తున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం ముంబాయిలో అత్యధికంగా 64లక్షల 75వేల మంది, రాజధాని ఢిల్లీలో 1లక్షల 51వేల మంది, కోల్‌కతాలో 14లక్షల 5వేల మంది, చెన్నైలో లక్షల 20వేల మంది, మన హైదరాబాద్‌లో 6లక్షల 27వేల మంది, బెంగుళూరులో 4లక్షల 31వేల మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. ఇక మన రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాల్లో 51లక్షల 7వేల మంది మురికివాడల్లో బతుకుతున్నారు. ఆందోళన కలిగించే విషయమేమిటంటే రోజురోజుకు ఈ మురికివాడల్లో నివసించే జనాభా పెరుగుతున్నది. 191లో 2కోట్ల 79లక్షల మందిగా ఉన్న ఈ జనాభా 2011 నాటికల్లా మూడు రెట్లు పెరగడం గమనార్హం.

ఈ ధోరణిని గమనించే కాబోలు కేంద్ర గృహ, పట్టణవూపాంత పేదరిక నిర్మూలన శాఖా మంత్రి కుమారి సెల్జా 2010 సెప్టెంబర్‌లో ఓ సంచలన ప్రకటన చేశారు. ఐదేళ్ల కాలంలో సాధించాలని యూపీఏ లక్ష్యంగా పెట్టుకున్న ‘‘మురికివాడల రహిత భారత్’’ అనేది సమీప భవిష్యత్‌లో సాకారం కావడం అసాధ్యమని తేల్చిచెప్పారు.

ఇప్పటికైనా పాలకులు తమ విధానాలను మార్చుకోవాలి. నగరాల సుందరీకర ణ పేరిట మురికివాడలను ఖాళీ చేయించడం, కార్పొరేట్ సంస్థలకు, రియల్ వ్యాపారులకు ప్రభుత్వ స్థలాలను కట్టబెట్టడం మానుకోవాలి. మురికివాడల్లో నివసిస్తున్న లక్షలాది మంది కూడా ఈ దేశ పౌరులేనని గుర్తించాలి. ఆశ్రయం పొందే హక్కు జీవించే హక్కులో భాగమేనని, మురికివాడల్లో నివసించే వారిని బలవంతంగా వెళ్లగొట్టడం తగదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను శిరసావహించాలి. నోటిఫైడ్ స్లమ్స్ అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించి అన్ని సౌకర్యాలు కలిగిన కాలనీలుగా మార్చాలి. రాజీవ్ ఆవాస్ యోజనలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. నాన్-నోటిఫైడ్ స్లమ్స్‌ను స్థానిక పరిస్థితులను బట్టి చట్టబద్ధం చేయాలి. లేదంటే అక్కడ నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయ గృహ వసతి కల్పించిన తర్వాతే ఖాళీ చేయించాలి. దేశంలో డజన్ల కొలదిగా ఉన్న ‘నోనదంగా’లపై మమత చూపించాలి.

 

  • డి మార్కండేయ

Latest News