Friday, July 5, 2024

జీశాట్‌–24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

ఫ్రెంచ్‌ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన జీశాట్‌–24 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాం నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఏరియన్‌–5 రాకెట్‌ ద్వారా న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌, కేంద్ర ప్రభుత్వం.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌(డీఓఎస్‌) సంయుక్తంగా రూపాందించిన జీశాట్‌–24 ఉపగ్రహాన్ని బుధవారం విజయవంతంగా రోదసిలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం 4,180 కిలోల బరువు.. 24 కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చి డీటీహెచ్‌ అప్లికేషన్‌ అవసరాలను తీర్చేందుకు పాన్‌ ఇండియా కవరేజీతో రోదసీలో పంపారు. ఈ ఉపగ్రహాం ద్వారా డీటీహెచ్‌ అప్లికేషన్‌లో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

Latest News