Wednesday, July 3, 2024

నిజాం కాలం నాటి ప్రముఖ విమానాశ్రయం తెలంగాణలో ఎక్కడ ఉందో తెలుసా….?

నిజాం కాలంలో తెలంగాణలో నిర్మించిన కట్టడాలు, గుళ్లు, ప్రసిద్ధి స్థలాలు, కోటలు… ఇలా చెబుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే, ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్, హన్మకొండ జిల్లాలుగా ఏర్పడిన విషయం తెలిసిందే. హన్మకొండ జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఎన్నో చూడదగ్గ ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, కుష్ మహల్, భద్రకాళి దేవాలయం ఇలా చాలానే ఉన్నాయి. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కూడా ఇక్కడే ఉంది. నిజాం కాలంలో నిర్మించినటువంటి విమానాశ్రయం కూడా ఈ జిల్లాలోనే ఉంది. దీనిని మామునూరు విమానాశ్రయం అని అంటారు.

Latest News