Monday, July 8, 2024

పేదరికం..అంకెల గారడీ..

దేశంలో ఎంత మంది పేదలున్నారన్న విషయంపై ఇటీవల ఉభయ సభల్లో పెద్ద దుమారం చెలరేగింది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ. 22. 42, పట్టణవూపాంతంలో రూ. 2.35 ఖర్చు పెట్టగలిగితే చాలు.. వాళ్లు పేదలు కాదం టూ ఇటీవల ప్రణాళిక సంఘం ప్రకటించడం ఈ వివాదానికి కారణమైంది. గత ఐదేళ్లలో దేశంలో పేదరికం 37.2 నుంచి 29.9 శాతానికి తగ్గిందని, 2004-05లో 40 కోట్ల 72 లక్షల సంఖ్యలో ఉన్న పేదలు 2010 మార్చి 1 నాటికి 35 కోట్ల 46 లక్షలకు తగ్గారని సంఘం అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం శాతం తగ్గగా, పట్టణాల్లో 4.శాతం తగ్గిందని తెలిపింది.

పేదరికంపై టెండూల్కర్ కమిటీ 2004-05 కోసం వేసిన అంచనాలను ద్రవ్యోల్బణం రేటుతో గణించగా ఈ లెక్కలు వచ్చాయని సంఘం ఉపాధ్యక్షుడు మాంటేక్‌సింగ్ అహ్లువాలియా వివరించారు. అయితే, ఈ లెక్కలను ప్రతిపక్షాలు తిరస్కరించాయి.గత అక్టోబర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఇదే సం ఘం పల్లెల్లో రోజుకు రూ. 26, పట్టణాల్లో రూ. 32 ఖర్చు చేయలేనివాళ్లు దారివూద్యరేఖ కిందికి వస్తారని పేర్కొని ఇప్పుడిలా అంచనాలు మార్చడమేమిటని ప్రశ్నించాయి.

అంకెల గారడీ చేసి దేశంలో పేదరికాన్ని తగ్గించి చూపుతున్న అహ్లువాలియాను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. ఇందుకు స్పందించిన ప్రధాని మన్మోహన్‌సింగ్ పేదరిక నిర్ధార ణ కోసం టెండూల్కర్ కమిటీ రూపొందించిన పద్ధతి సమక్షిగంగా లేని మాట వాస్తవమని ఒప్పుకున్నారు. ఈ అంశంపై అధ్యయనం చేయడానికి ఒక సాంకేతిక కమిటీ వేయనున్నట్లు ప్రకటించారు.

ఎలా నిర్ణయించాలి?

ఎవరిని పేదలుగా గుర్తించాలన్న విషయంలో వివాదం ఇప్పటిది కాదు. రాచ రి కం అంతమై ప్రజాస్వామికపాలన ఆరంభమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు పేదరికంపై దృష్టి సారించాయి. సమాజంలోని కొన్ని వర్గాలు కనీస సౌకర్యాలు లేక ఆకలితో అలమటిస్తున్నాయని గుర్తించి అలాంటి వారు ఎవరో కనుగొనడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన ఐక్యరాజ్యసమితి ఒక మనిషి ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన పోషకాహారం, కట్టుకోడానికి దుస్తులు, ఉండడానికి ఇల్లు, విద్య, వైద్యం అందుబాటులో లేనివాళ్లను పేదలుగా పరిగణించాలని పేర్కొంది.

ఇందుకోసం అవసరమైనంత డబ్బును సంపాదించే ఉపాధిలేక, అప్పు కూడా పుట్టక, అభవూదతతో, నిస్సహాయస్థితిలో బతికేవారిని దారివూద్యరేఖకు దిగువన జీవిస్తున్నట్లుగా భావించాలని వివరించింది. ప్రపంచబ్యాంకు కూడా పేదరికాన్ని ఇదేవిధంగా నిర్వచించి సమాజంలో ఓ వ్యక్తి బతకడానికి అవసరమైన డబ్బును డాలర్లలో నిర్ధారించింది. రోజుకు 1.25 డాలర్లు (62 రూపాయలు) కూడా ఖర్చుపెట్టలేని వారిని కడుపేదలుగా, రెండు డాలర్లు (సుమారు వంద రూపాయలు) ఖర్చుపెట్టలేని వారిని పేదలుగా పరిగణించాలని తెలిపింది. దీన్ని ఆయాదేశాల్లో అప్పటి ద్రవ్యోల్బణం, కొనుగోలుశక్తిలో తారతమ్యతల ఆధారంగా గణించి బెంచ్‌మార్క్‌ను రూపొందించాలని సూచించింది.

అక్కడ అలా..

ఉన్నతస్థాయి జీవన ప్రమాణాలున్నాయని భావిస్తున్న అగ్రరాజ్యం అమెరికాలో సమాజం సగటున అనుభవిస్తున్న సౌకర్యాలు, సేవలు అందక, దీనావస్థలో ఉన్నవారందరినీ పేదలుగా పరిగణిస్తున్నారు. డబ్బు లెక్కల్లో చూస్తే సంవత్సరానికి 11వేల139 డాలర్లు (రూ.5లక్షల 46 వేలు) ఖర్చు చేయని వ్యక్తి లేదా 22,350 (రూ. 11 లక్షలు) డాలర్లు వెచ్చించని నలుగురు సభ్యుల కుటుంబం పేదరికంలో ఉన్నట్లుగా ఆ దేశం భావిస్తోంది. అమెరికన్ సెన్సస్ బ్యూరో విడుదల చేసిన కరెంట్ పాపులేషన్ సర్వే ప్రకారం 200లో అక్కడ 3కోట్ల 9లక్షల మంది (13.2శాతం) పేదలుండగా 2010 నాటికి ఆ సంఖ్య 4కోట్ల 62లక్షలకు(15.1శాతం) చేరింది. నల్ల జాతీయుల్లో 27.4శాతం, శ్వేత జాతీయుల్లో 9.9 శాతం, నాన్ హిస్పానిక్ శ్వేత జాతీయుల్లో 9.9శాతం, హిస్పానిక్ అన్ని జాతుల్లో 26.6శాతం, ఆసియావాసుల్లో 12.1శాతం పేదవాళ్నున్నారు.

2011లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జనాభా లెక్కల అధికారులే ఒప్పుకుంటున్నారు. ఇక దేశంలోని సగటు కుటుంబ ఆదాయంలో కనీసం 60శాతం సంపాదన లేని కుటుంబాలను పేదరికంలో ఉన్నట్లుగా బ్రిటన్ పరిగణిస్తోంది. కరెన్సీ రూపంలో అయితే, వారానికి 124 పౌండ్లు(రూ.10వేలు) ఖర్చు పెట్టలేని వ్యక్తిని, 346 పౌండ్లు(రూ.2వేలు) ఖర్చు పెట్టలేని నలుగురు సభ్యుల కుటుంబాన్ని దారివూద్యరేఖకు దిగువన ఉన్నట్లు లెక్కిస్తోంది. ప్రస్తుతం అక్కడ ప్రతి ఐదుగురిలో ఒకరు పేదరికంలో మగ్గుతున్నారు. 1979-0లో13.7శాతం ఉన్న పేదరికం 2009-10నాటికి తిరిగి 22.2 శాతానికి చేరుకుంది.

67 సర్వేలు.. కన్ఫ్యూజన్..

మన దేశానికి వస్తే, పేదరికం నిర్ధారణలో ఇక్కడ మొదటి నుంచీ ఒక నిర్దిష్ట విధానమంటూ అనుసరించిన దాఖలాలు లేవు. దేశ ప్రజల జీవన ప్రమాణాలను అంచ నా వేయడానికి 1951 నుంచి ఇప్పటివరకు 66 జాతీయ శాంపిల్ సర్వేలు జరిగి, 67వ సర్వే ప్రస్తుతం కొనసాగుతున్నా ఎవరిని పేదలుగా పరిగణించాలనే విషయంలో ఒక స్పష్టత రాలేదు. 197లో నిపుణుల కమిటీ సూచనల ఆధారంగా ప్రణాళికా సంఘం తొలిసారిగా దారివూద్యరేఖ విషయంలో కొన్ని నిర్ధారణలకు వచ్చిం ది.

పట్టణాల్లో 2100 కెలరీలు, పల్లెల్లో 2400 కెలరీలు ఆహారం రూపంలో పొందలేని జనాభాను పేదలుగా పరిగణించాలని నిర్ణయించింది. అప్పటి ధరల ఆధారంగా సంవత్సరానికి పల్లెల్లో నెలకు రూ.61.0(రోజుకు రూ.2.06), పట్టణాల్లో రూ.71.30(రోజుకు రూ.2.37) ఖర్చు పెట్టలేని వారిని దారివూద్యరేఖకు దిగువన చేర్చింది. ఆ తర్వాతి కాలంలో ప్రతియేటా జరిగే శాంపిల్ సర్వేలను ఆధారం చేసుకుని, ద్రవ్యోల్బణంతో గణించి ఎప్పటికప్పుడు ప్రణాళికాసంఘం ఎవరు పేదలో అంకెలు విడుదల చేస్తూ వస్తున్నది.

టెండూల్కర్ కమిటీ నిర్ణయాలు..

అయితే పేదరికాన్ని నిర్ధారించే పద్ధతిపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రణాళికా సంఘం ప్రకటిస్తున్న అంకెలు ఓ వ్యక్తి తీసుకునే ఆహారం కొనడానికి ఏమాత్రం సరిపోవని, పేదరికాన్ని తగ్గించి చూపడానికే ప్రణాళికా సంఘం ప్రయత్నిస్తున్నదని పలువురు విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో పేదరికాన్ని ఎలా నిర్ధారించాలనే విషయంపై ప్రభుత్వం 1993లో డీ టీ లక్డావాలా కమిటీని వేసింది. ఈ కమిటీ అన్ని కోణాలను పరిశీలించి పాత పద్ధతికే మొగ్గుచూపింది. ఒక కుటుంబం నెల రోజుల కాలంలో వినియోగించిన ఆహారపదార్థాలను అప్పటి ధరలపై ఆధారపడి లెక్కించి పేదరికాన్ని నిర్ణయించాలని తెలిపింది.

శాంపిల్ సర్వేల ఆధారంగా 1993-94లో పల్లెల్లో 37.3శాతం, పట్టణాల్లో 32.4 శాతం, మొత్తంగా 36 శాతం పేదరికం ఉంద ని తెలిపింది. వివిధ వర్గాల నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఈ కమిటీ నివేదికను ఆమోదించలేదు. తర్వాతికాలంలో 2005 డిసెంబర్ 2న సురే ష్ టెండూల్కర్ నేతృత్వంలో మరో కమిటీని నియమించారు. ఈ కమిటీ పేదరిక నిర్ధారణ కోసం లక్డావాలా సూచించిన పద్ధతితో విభేదించింది. పేదలు అవునో కాదో కేవలం తీసుకునే ఆహారాన్ని, కెలరీలను బట్టే కాకుండా విద్యకు, వైద్యానికి అయ్యే ఖర్చులను భరించేశక్తిని కూడా లెక్క తీసుకోవాలని తెలిపింది.

డబ్బురూపంలో..

వివిధ రాష్ట్రాలకు, పల్లెలకు, పట్టణాలకు వేర్వేరుగా డబ్బు రూపంలో బెంచ్‌మార్క్‌లను నిర్ణయించింది. 2004-05 నాటికి పల్లెల్లో రూ. 446.6 (రోజుకు రూ.14.9), పట్టణాల్లో రూ. 57.0(రోజుకు రూ.19.30) ఖర్చు పెట్టలేని వారిని దారివూద్యరేఖకు దిగువన ఉన్నట్లు పరిగణించాలని తెలిపింది. 2004-05 నాటికి దేశంలోని పల్లెల్లో 41. శాతం, పట్టణాల్లో 25.7 శాతం, మొత్తంగా 37.2 శాతం పేదరికం ఉందని అంచనా వేసింది.

2009 నవంబర్‌లో టెండూల్కర్ కమిటీ సమర్పించిన నివేదికపై కూడా విమర్శలు వెల్లు వెత్తాయి. పల్లెల్లో రూ.15కు, పట్టణాల్లో రూ.19కి ఒకవ్యక్తి బతకడం ఆసాధ్యమని మేధావులు, నిపుణులు వాదించడంతో ప్రభుత్వం ఈ కమిటీ నివేదికను కూడా పక్కనబెట్టింది. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు ఎవరికి వర్తింపజేయాలో నిర్ధారించేందుకు ఎన్‌సీ సక్సేనా నేతృత్వంలో మరో కమిటీని నియమించింది.

మీడియాకు విడుదల..

దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారిని నిర్ణయించే విషయంలో పీయూసీఎల్ వేసిన ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాగా 2011 అక్టోబర్‌లో ఆ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో రోజుకు పల్లె ల్లో రూ.26, పట్టణాల్లో రూ.32 ఖర్చు చేయలేని వాళ్లను తాము పేదరికంలో ఉన్నట్టు గుర్తించాలని నిర్ణయించామని ప్రణాళికా సంఘం తెలిపింది. మరోవైపు, టెండూల్కర్ కమిటీ 2004-05 కోసం రూపొందించిన బెంచ్‌మార్క్ లెక్కలను ఆమోదించడమే కాకుండా 2010-11 ఆర్థిక సంవత్సరానికి తనకు తోచిన పద్ధతిలో ఆన్వయించిన ప్రణాళికాసంఘం సోమవారం పేదరికం లెక్కలను మీడియాకు విడుదల చేసింది.

మరో విచిత్రమేమిటంటే ప్రణాళికా సంఘం చేసే ఈ ప్రక్రియ అంతా కేవలం పేదరికాన్ని అంచనా వేయడానికి మాత్రమే పరిమితం కావడం. ప్రభుత్వ పథకాలు, ప్రజాపంపిణీ వ్యవస్థకు వర్తించకపోవడం. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతి పంచవర్ష ప్రణాళికను పురస్కరించుకుని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వివరాలను విడిగా నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రణాళికా సంఘం తాజాగా విడుదల చేసిన లెక్కల ఆధారంగా పథకాలు, సబ్సిడీల పంపిణీ జరగదని, త్వరలో పూర్తయ్యే సామాజిక-ఆర్థిక కుల గణన ఆధారంగా జరుగుతుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

77శాతం పేదలు..

ఇక, మన దేశంలోని పేదరికాన్ని వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పలురకాలుగా విశ్లేషించాయి. 2005లో ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం భారత జనాభాలో 41.6 శాతం పేదలున్నారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెంది న అధ్యయన బృందం ఇటీవల ఈ శాతాన్ని 53.7గా నిర్ధారించింది. ఇందులో 2.6 శాతం మంది కటిక దరి ద్రులని తేల్చింది. 1994-2004 మధ్య పదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకున్న అసంఘటిత పరిక్షిశమల జాతీ య కమిషన్(అర్జున్‌సేన్ గుప్తా నివేదిక) రోజుకు రూ.20 కూడా ఖర్చు పెట్టలేని వారు దేశంలో 77శాతం ఉన్నారని తెలిపింది.

ఏం చేయాలి?

అంతర్జాతీయ సమాజం దృష్టిలో భారత్‌లో పేదరికం లేదని చెప్పడం కోసం, పేదరిక నిర్మూలన కోసం కేటాయించే నిధులను, పేదలకిస్తున్న సబ్సిడీలను తగ్గించడం కోసం కుట్ర జరుగుతోంది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ప్రియ శిష్యుడైన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అహ్లువాలియా ఈ కుట్రకు ప్రాతిపదికను తయారుచేస్తున్నారు. అందులో భాగమే ఈ అంకెల గారడీ అని చెప్పక తప్ప దు. సమాజంలో పేదలు ఎవరు, ఎంత మంది ఉన్నారనే విషయం నిర్ణయించడానికి ఇన్ని కమిటీలు, ఇన్ని సర్వేలు అక్కర్లేదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి అన్ని అంశాలతో ఒక సమగ్ర సర్వే నిర్వహించాలి.

ఆ వివరాలను ఆయా గ్రామ సభల, వార్డు సభల ముందుంచి ఆమోదింపజేయాలి. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోడానికి దుస్తులు, చదువుకునేందుకు, జబ్బు చేస్తే చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక స్తోమతలేని ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం దారిద్య్రరేఖకు దిగువకు వచ్చే విధంగా బెంచ్‌మార్క్‌ను రూపొందించాలి. అన్ని రకాల పథకాలను, సబ్సిడీలను, ప్రోత్సాహకాలను వీరికే వర్తింపజేయాలి. 12వ పంచవర్ష ప్రణాళిక(2012-17)లో పేదరిక నిర్మూలన కోసం భారీగా నిధులు కేటాయించాలి.

  • డి మార్కండేయ

Latest News